
294views
అన్నమయ్య జిల్లా తంబళపల్లె మండలంలోని కోటకొండలో ఓ రైతు పొలంలో పురాతన రాతి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు.. మద్దిరాళ్లపల్లె సమీపంలోని రంగారావు పొలాన్ని వెంకటేష్ కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలాన్ని ట్రాక్టర్ తో దున్నించాడు. మరసటి రోజు ఆ పొలంలో వెంకటేష్ వెళుతుండగా మట్టితో కప్పబడిన రాళ్లు కనబడ్డాయి. మట్టి తొలగించి పరిశీలించగా అవి పురాతన రాతి విగ్రహాలుగా గుర్తించారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలుసుకుని రాతి విగ్రహాలను పరిశీలించి పూజలు చేశారు.





