News

‘రామదండు’లా తరలి రండి!

351views

అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న కడపలో నిర్వహించనున్న శ్రీరామ మహా శోభాయాత్రకు భక్తులంతా రామదండులా నిండైన భక్తితో తరలి రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ మైదానం వద్ద శ్రీరామ కల్యాణ వేదిక నుంచి భారీ మోటారు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్టించి ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రామ మహా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ప్రతినిధులతోపాటు ఆధ్యాత్మిక సంస్థలు, దేవాలయాల కమిటీల సభ్యులు, యువజన సంఘాలు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.