News

విశాఖలో డాక్టర్ హెడ్గేవార్ ఆరోగ్య కేంద్రం ప్రారంభం

212views

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 4 కోట్ల మందికి కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తోందని.. ప్రజలు తమవంతు సహకారం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. 6 నెలలు నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలకు 44 రకాల వ్యాధులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని ఆయన తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా గుడిలోవ విజ్ఞాన విహాద సాఠశాలలో నూతనంగా నిర్మించిన 50 పడకల డాక్టర్ హెడ్గేవార్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా గుడిలోన విజ్ఞాన విహార్ 4 దశాబ్దాలకు పైబడి సేవలు అందిస్తోందన్నారు. నూతన విద్యావిధానం బానిసవాదం. నుంచి భావితరాలను కాపాడమే లక్ష్యంగా రూపొందించబడిందన్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో వస్తోన్ని మార్పులు కేన్సర్ కు ప్రధాన కారణంగా మారుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.