News

భారత ఉపరాష్ట్రపతికి కొమొరోస్‌ అత్యున్నత పురస్కారం

483views

ఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ ప్రకటించిది. కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కొమొరోస్‌ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్‌-కొమొరోస్‌ మైత్రికి గుర్తుగా ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ”సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరుదేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది. పరస్పర పురోగతికి స్వప్నమిది” అని వెంకయ్యనాయుడు చెప్పారు.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.