News

మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక : ప్రధానమంత్రి

143views

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రధానమంత్రి సంభాషించే మన్‌కీ బాత్‌ మనసులో మాట 118వ సంచికలో పలు విషయాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కుంభమేళా కార్యక్రమం అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. దేశ యువత ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.ప్రపంచ దేశాల ప్రజలు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. కుంభమేళాకు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను అభినందించారు. దేశంలోని యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు.