News

ధర్మ రక్షణకే హిందూమతం

347views

ధర్మాన్ని రక్షించడానికి హిందూమతం పుట్టిందని గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. విశ్వధర్మ విజయ యాత్రలో భాగంగా క్షేత్ర యాత్ర నిర్వహిస్తున్న దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాళ్ల గ్రామంలోని దత్తపాదుకా క్షేత్రానికి విచ్చేశారు. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన సుమారు 200 మందికి పైగా మహిళలతో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా సచ్చితానంద స్వామజీ భక్తులకు ప్రవచనాలను బోధించారు. కార్యక్రమంలో పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, గోళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం ఆకివీడులోని దత్త క్షేత్రాన్ని సందర్శించి, క్షేత్ర అభివృద్ధికి రూ. 55 లక్షలు ఫిక్సిడ్‌ డిపాజిట్‌ సొమ్మును అందజేశారు. అనంతరం నిర్వహించిన సత్సంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎంతో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతారన్నారు. చిన్న స్వామీజీ విజయానంద, దత్త క్షేత్ర కార్యదర్శి కంభంపాటి త్రినాథ కృష్ణమూర్తి పాల్గొన్నారు.