News

కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు

260views

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక సర్వీసు నడపనుంది. ఫిబ్రవరి 15న ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి పయనం అవుతుంది. అనంతరం 22న మళ్ళీ నగరానికి చేరుకుంటుంది. మొత్తం 8 రోజులపాటు యాత్ర సాగనుంది. భక్తులు… వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను దర్శించుకునేలా ప్యాకేజీని రూపొందించింది.

ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే పెద్దలకు రూ. 23,035, 11 ఏళ్ళ లోపు పిల్లలకు రూ. 22,140గా చార్జీలు నిర్ణయించారు. 15న సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు 18న ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. 19న వారణాసిలో కాశీవిశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను భక్తులు దర్శించుకుని అదే రోజు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు.
అనంతరం 20న అయోధ్య చేరుకుంటుది. శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 22న రాత్రి రైలు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపూర్‌ (బరంపురం), చత్రపూర్‌, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసూర్‌ స్టేషన్లలో రైలు ఆగుతుంది.