
228views
అనంతపురంలోని సేవాఘడ్‌లో ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. జయంత్యుత్సవాల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల పర్యవేక్షణకు మూడు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. సేవాఘడ్‌కు వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలన్నారు. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల. ఆర్‌డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





