News

శంభల్‌ మసీదు బావిపై యథాతథ స్థితి : అధికారులకు సుప్రీం ఆదేశాలు

183views

వివాదాస్పదంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని శంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ యథాతథ పరిస్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. అక్కడ ఉన్న ‘ప్రయివేటు బావి’ జోలికి పోకూడదని, సర్వేలు జరపకూడదని పురావస్తు సర్వే విభాగానికి సూచించింది. అక్కడి శాంతిభద్రతల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు పేర్కొంది. శంభల్‌లో జిల్లా అధికారులు జరుపుతున్న తవ్వకాలను సవాలు చేస్తూ షాహీ జామా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడి పరిస్థితులపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.