News

సంక్రాంతికి ‘జన సాధారణ్‌ అన్‌ రిజర్వ్‌డ్‌’ స్పెషల్‌ ట్రైన్లు

301views

సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

1) రైలు నంబర్‌ (08534) చర్లపల్లి-విశాఖపట్నం (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) జనవరి 11, 13, 16, 18 తేదీలలో చర్లపల్లి నుంచి ఉదయం 00.30 గంటలకు (రాత్రి 12.30 గంటలకు) బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు (అదే రోజున ) విశాఖపట్నం చేరుకుంటుంది. 2) రైలు(08533) విశాఖపట్నం-చర్లపల్లి (జనసాధారణ్ అన్‌రిజర్వ్డ్ స్పెషల్ రైళ్లు) విశాఖపట్నం నుంచి జనవరి 10, 12, 15, 17 తేదీలలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరి (అదే రోజు) రాత్రి 22.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు నంబర్‌ (08533/08534) విశాఖపట్నం-చర్లపల్లి – విశాఖపట్నం జనసాధారణ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్ లలో ఇరువైపులా ఆగుతాయి.

3) రైలు నంబర్‌: (08538) చర్లపల్లి-విశాఖపట్నం (జన సాధారణ్‌ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) జనవరి 11, 12, 16, 17వ తేదీల్లో చర్లపల్లిలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరి 22.00 గంటలకు (అదే రోజు రాత్రి) విశాఖపట్నం చేరుకుంటుంది.

4) రైలు నంబర్‌ (08537) విశాఖపట్నం – చర్లపల్లి (జనసాధారణ అన్‌ రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లు) 2025 జనవరి 10, 11, 15 ; 16 తేదీలలో విశాఖపట్నం నుండి (సాయంత్రం 6.20) 18.20 గంటలకు బయలు దేరుతుంది మరియు 08.00 గంటలకు (మరుసటి రోజు ఉదయం) చర్లపల్లి చేరుకుంటుంది. రైలు(08537/08538) విశాఖపట్నం-చర్లపల్లి-విశాఖపట్నం జనసాధరణ (అన్ రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతాయి.