News

కుమార్‌కు సంస్కృత అనువాద పరికరం పేటెంట్‌

318views

జాతీ య సంస్కృత వర్సి టీ ఎడ్యుకేషన్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కుమార్‌ బాగే వాడిమన్‌కు సంస్కృత అనువాద పరికరంపై పేటెంట్‌ లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పేటెంట్‌ కార్యాలయం సమాచారం అందించింది. స్పీచ్‌ టూ టెక్ట్స్‌, టెక్ట్స్‌ టూ స్పీచ్‌ ఫంక్షనాలిటీని సులభరతం చేసేందుకు ఆయన ఏఐ ఆధారిత సంస్కృత అనువాద పరికరానికి రూపకల్పన చేశారు. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న అధ్యాపకుడు కుమార్‌ బాగేను వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, రిజిస్ట్రార్‌, అధ్యాపకులు అభినందించారు.