
బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిం ఛాందసుల దాడులు కొనసాగుతూనే వున్నాయి. హిందువులకు, దేవాలయాలకు భద్రత కల్పిస్తామని అక్కడి ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలే ఇస్తోంది తప్పించి, కార్యాచరణకు మాత్రం నోచుకోవడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ లో హిందూ యువకుడు సుబేద్ హల్దర్ హత్యకు గురయ్యాడు. మృతదేహం రోడ్డుపైనే వుండిపోయింది. హిందూ యువకుడు కాబట్టే ముస్లిం ఛాందసులు హత్య చేశారని స్థానిక హిందువులు ఆరోపిస్తున్నారు.సుబేద్ హల్దార్ ఎలక్ట్రానిక్ వ్యాపారిగా వున్నాడు. ఈ ఘటన ఝల్కతి జిల్లా రాంపూర్ గ్రామంలోని భౌకతి మార్కెట్ లో జరిగింది.
సుబేద్ తలపై బలమైన గాయం కనిపించిందని హల్కతి పోలీసులు తెలిపారు. అదే దీనిని అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం జలకతి సదర్ ఆస్పత్రికి తరలించారు. సుబేద్ ను పలుమార్లు కత్తితో పొడిచారని, అతని తలపై, మెడపై లోతైన గాయాలు వున్నాయి.
ఈ ఘటనపై సుబేధ్ హల్దార్ తండ్రి సుబోధ్ స్పందించారు. తన కొడుకుకి ఎవ్వరితోనూ శత్రుత్వం లేదన్నారు. తన కొడుకును ఎవరు చంపారో; ఎందుకు చంపారో అర్థం కావడం లేదని వాపోయారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించి, హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.
బంగాబంధు ప్రకాసోలి పరిషత్ కార్యదర్శి కూడా స్పందించారు. బంగ్లాదేశ్ లో ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట హిందువులపై దాడులు జరుగుతునే వున్నాయన్నారు. సుదేవ్ హల్దార్ కి ఎవ్వరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదని తెలిపారు. హిందువు కాబట్టే చంపేశారని మండిపడ్డారు. అసలు బంగ్లాదేశ్ ఏం సందేశాన్ని పంపాలనుకుంటోంది? అని సూటిగా ప్రశ్నించారు. హిందువులను ఇక్కడి నుంచి పంపడానికే ఇలా బెదిరిస్తున్నారన్నారు.





