News

అంతరిక్షంలో అలసంద మొలకలు…

331views

అంతరిక్షంలో మొలకలు వచ్చాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. అలసంద విత్తనాలు మొలకెత్తాయి. ఈ ఘనత ఇస్రో సాధించింది. ఇస్రో స్పేడెక్స్‌లో ప్రయోగం చేపట్టిన నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు ఇస్రో తెలిపింది.

కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ పేరిట పీఎస్ఎల్వీ – సీ 60 రాకెట్ లో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపింది. అందులో 8 అలసంద విత్తనాలు చేరవేయగా అవి నాలుగు రోజుల్లో మొలకెత్తాయి. ఈ విషయాన్ని తాజాగా ఇస్రో వెల్లడించింది.

అంతరిక్షంలో జీవం మొలకెత్తిందని, త్వరలో చిగురులు కూడా వస్తాయని ఎక్స్‌ వేదికగా ఇస్రో తెలిపింది. పేలోడ్‌ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది.

అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే పద్ధతితో రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హ్యాండ్, హరిత చోదన వ్యవస్థ వంటి ఉపకరణాలను కూడా ఇస్రో అంతరిక్షంలోకి చేరవేసింది.

సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర పెరుగుదల గురించి కూడా పరీక్షించనున్నారు.