News

మహా కుంభమేళా ప్రాంతమంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ

289views

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా ప్రాంతమంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా టెలి కమ్యూనికేషన్స్ విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రొవైడర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని తెలియజేసింది. టెలికాం సర్వీస్ ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన ఈ మేళాకు భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు నెట్వర్క్ సంక్రమంగా అందేలా చూడాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రయాగ్ రాజ్ నగరం అంతటా 126 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ వేశారు. అదనంగా, 328 కొత్త టవర్లు, మాస్టట్లు ఏర్పాటు చేశారు. ఒక్క మేళా ప్రాంతంలోనే హై-స్పీడ్, సరైన నెట్వర్క్ కవరేజీని అందించడానికి 192 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రధాన రవాణా కేంద్రాలు, అలాగే బస చేసే ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, ప్రయాగ్ రాజ్ లోపలికి, వెలుపలికి వెళ్లే హైవేలతో సహా కీలకమైన బహిరంగ ప్రదేశాలలో కూడా టెలికాం సేవలు అందిస్తున్నారు.