News

పాస్టర్లకు చుక్కలు చూపిన గ్రామం… దెబ్బకు పరార్

252views

క్రైస్తవ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ యావత్ గ్రామం వీధిలోకి వచ్చి నిరసన తెలిపిన ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది.నందవరం మండలం జగ్గాపురం గ్రామంలో హిందువులు ఉండే ఇళ్ల మధ్య అనుమతి లేకుండా కొందరు పాస్టర్లు అన్యమత ప్రచారం చేస్తుండగా స్థానిక గ్రామస్థులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన వారిలో నందవరం గ్రామస్థుడు కూడా ఉన్నాడు.గ్రామస్థులు ఒకేసారి తమను వ్యతిరేకించడాన్ని పాస్టర్లు సహించలేకపోయారు.మమ్మల్నే ప్రశ్నిస్తారా.. అంటూ సుమారు 100 మందికి పైగా మతోన్మాదులు గ్రామస్థుడి ఇంటిపై దాడికి తెగబడ్డారు.

హిందూ సమాజం మమ్మల్ని ఏం చేస్తుందిలే అనుకున్న మతోన్మాద మూకలకు షాక్ తగిలింది.
హుటాహుటిన దాదాపు 200 మంది గ్రామస్థులు కలిసి మతోన్మాద మూకలను గ్రామం నుండి తరిమికొట్టారు. అంతటితో వీరి ధర్మాగ్రహం చల్లారలేదు. యావత్ గ్రామం రోడ్డుమీదకు వచ్చి క్రైస్తవ మతోన్మాదానికి నిరసన ప్రదర్శన చేపట్టాయి. విశ్వహిందూ పరిషద్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ ద్వారా గ్రామంలో నూతన చైతన్యం వచ్చింది. ఇకపై మా గ్రామంలో సమస్య సృష్టించాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ నందవరం గ్రామస్తులు మతోన్మాదులకు హెచ్చరిక జారీ చేశారు.