ArticlesNews

నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదట… పినరయ్ కొత్త వక్ర భాష్యం

432views

నారాయణ గురు సనాతన ధర్మ వాది కాదట. ఇది చెప్పిందెవరో తెలుసా? కేరళ ముఖ్యమంత్రి పినయర్ విజయన్. కొన్ని రోజుల క్రితం హిందూ దేవతలను, పండగలను సమర్థిస్తూ హిందువుల ఓట్ల కోసం తాము కూడా ప్రయత్నాలు చేద్దామని సీపీఎం ఓ తీర్మానమే చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ కోవలోకే ఇది కూడా వస్తుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ధర్మం వారసత్వ వృత్తులను స్వీకరిస్తుందన్నారు. అయితే నారాయణ గురు వారసత్వంగా వచ్చిన వృత్తులను ధిక్కరించాల్సిందేనని పిలుపునిచ్చారన్నారు. అలాంటప్పుడు నారాయణ గురు సనాతన ధర్మ వాది ఎలా అవుతారంటూ వితండ వాదానికి దిగారు.

ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని ప్రచారం చేసిన నారాయణ గురు సనాతన ప్రతిపాదకుడు ఎలా అవుతారని అన్నారు.కుల వ్యవస్థలున్న కాలం నాటి సాంస్కృతిక నేపథ్యం వున్న మహాభారతం ధర్మానికి సంబంధించిన కచ్చితమైన సమాధానం చెప్పకుండా అనేక సందేహాస్పద ప్రశ్నలను లేవెనెత్తే విధంగా వుందంటూ వ్యాఖ్యానించారు.నారాయణ గురు సనాతన ధర్మ వాదే అని చూపడానికి చాలా వ్యవస్థీకృత ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.ఆయన సనాతన ధర్మ వాది కాదని, అవన్నీ కూల్చేసి, ఆధునిక కాలానికి సరిపోయే కొత్తయుగ ధర్మాన్ని బోధించిన గొప్ప జ్ఞాని అంటూ కొత్త భాష్యానికి తెరలేపారు సీఎం విజయన్.

అలాగే మహాభారతాన్ని ఉటంకిస్తూ సీఎం విజయన్ సనాతన ధర్మాన్ని కించపరిచారు. కోర్ రాజు, మార్తాండ వర్మ సనాతన ధర్మం కోసం ఓ దేశాన్నే ఊహించుకుంటూ సంస్కరణలను ప్రారంభించారని… అదే ఒరవడి ఇప్పటికీ భారత రాజకీయాల్లో వుందని, సనాతన, హిందుత్వ లాంటి పదాలను పేర్కొంటున్నారని అన్నారు. ఈ పదాలు చక్రవర్తులకు, మతపరంగా వున్న వారికి అత్యంత ప్రియమైన పదాలని, ఈ పదాల చాటున బ్రాహ్మణవాదాన్ని, రాచరికాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వర్కాలో 92 వ శివగిరి యాత్ర ప్రారంభోత్సవంలో సీఎం పినయర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సనాతనం, హిందుత్వ అన్న పదాలు అత్యంత మహిమాన్వితమైనవంటూ ప్రచారాలు చేస్తున్నారని, ఈ కాలంలో మనం జీవిస్తున్నామని పినరయ్ సనాతన ధర్మీయులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ పంథా ఒక్కటే శరణ్యమంటూ కొందరు ప్రచారాలు చేస్తున్నారని దెప్పిపొడిచారు. లోకాస్సమస్త సుఖినో భవంతు అని చదువుతుంటారని, అంటే.. అందరూ బాగుండాలన్న అర్థం వస్తుందని, ఇది నిస్సందేహంగా మంచిదేనన్నారు. అత్యంత ఉన్నతమైనది అంటూ పేర్కొంటునే… హిందుత్వ మొక్కటే ఈ పని చేస్తుందన్న కథనాన్ని ప్రపంచంలోకి చొప్పిస్తున్నారంటూ తన అక్కసును వెళ్లగక్కారు.