
367views
విజయవాడలో జనవరి 5వ తేదీ నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కర్నూలులోని దేవీ ఫంక్షన్ హాల్‌లో ఆవిష్కరించారు. ఎంట్రీ పాస్, కారు ఎంట్రీ పాస్, ప్రయాణికుల గుర్తింపు కార్డులను వీహెచ్‌పీ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, సహ కార్యదర్శి ప్రాణేష్, హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ భాను ప్రకాష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ హైందవ శంఖారావం బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని కోరారు. గుర్తింపు కార్డు, ఎంట్రీ పాస్ ఉంటేనే సభకు అనుమతి ఇస్తారన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో హైందవ శంఖారావం సహ కన్వీనర్లు చంద్రశేఖర్, హనుమంత రెడ్డి, రవాణా ప్ర ముఖ్ ఈపూరి నాగరాజు, సభ్యులు రాంబా బు, శ్రీనివాస రాజులు, శివరాముడు పాల్గొన్నారు.





