News

వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు

265views

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనాల ఎస్.ఎస్.డి. టైం స్లాట్ టోకెన్స్ జారీ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ వెంకటేష్,ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. త్వరితగతిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టిటిడి ఈవో శ్యామలారావు పాత్రికేయులతో మాట్లాడుతూ జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వారా దర్శనాలను కల్పిస్తామని..జనవరి 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి లక్ష 20 వేల టోకెన్లను జారీ చేస్తామని..మిగిలిన 7 రోజులకు ముందు రోజు మాత్రమే ఎస్ఎస్డీ టైం స్లాట్ టోకెన్స్ జారీ చేస్తామన్నారు. టోకెన్ల జారీకి తిరుపతి, తిరుమలలో 9 కేంద్రాలలో 91 కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని..గోవిందమాల భక్తులకు ప్రత్యేక టికెట్లను జారీ చేయడం లేదన్నారు.