
266views
శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి మండల మకరవిలక్కు యాత్ర సందర్భంగా యాత్రికులకు అన్నదానం నిర్వహించే కేంద్రాల వద్ద డబ్బులు వసూలు చేయొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)ను కేరళ హైకోర్టు ఆదే శించింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ మురళీ కృష్ణ ఎస్ ధర్మాసనం ఉత్త ర్వులు జారీ చేసింది.ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు టీడీబీ నిర్వహణలోని ఆలయాల వద్ద చేపడుతున్న అన్నదాన కార్య క్రమం వద్ద యాత్రికుల నుంచి నగదు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదున నుసరించి పై మేరకు స్పందించింది. మరోవైపు ఈ నెల 26 నుంచి ప్రారంభమై 41 రోజుల పాటు సాగే మండల పూజ (మకరవిలక్కు యాత్ర)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయవర్గాలు వెల్లడించాయి.





