
ఇస్లాంను అవమానిస్తూ వాట్సాప్ లో పోస్ట్ చేశారంటూ మహారాష్ట్రలోని హింగోలిలో వ్యాపారవేత్త కైలాష్ కబ్రా ఇంటిపై 16 మంది దాడి చేశారు. దీంతో ఆ 16 మందినీ పోలీసులు అరెస్ట్ చేశారు.రెండు రోజుల క్రితం వస్మత్ లోని మార్కెట్ లో 50 మంది గుంపు వ్యాపారవేత్త ఇంటిపై, తన దుకాణంపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఘర్షణకి దారితీసింది.ఘర్షణని ఆపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులపై కూడా మూక దాడి చేసింది. దీంతో ఎస్డీపీఓ రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.కైలాష్ ను లక్ష్యంగా చేసుకొని, మూక రాళ్లు రువ్వడం ప్రారంభించింది. దీంతో మరింత ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. గుంపును చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ చేశారు. ఎనిమిది మందిని వెంటనే అదుపులోకి తీసుకకున్నారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ లో మరో 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 20 మంది పరారీలో వున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరందరిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు: హత్యాయత్నం, అల్లర్లు, ప్రభుత్వోద్యోగిని తమ విధులను నిర్వర్తించకుండా నిరోధించారంటూ కేసులు పెట్టారు.





