News

‘జై శ్రీరాం’ అనడం క్రిమినల్‌ చర్యనా….సుప్రీంకోర్టు

281views

‘జై శ్రీరాం’ అనడం క్రిమినల్‌ చర్యనా….సుప్రీంకోర్టు

‘జై శ్రీరాం’ అనడం క్రిమినల్‌ నేరమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏదైనా మతానికి చెందిన పేరునుగానీ, నినాదాన్నిగానీ ఎలుగెత్తి చెప్పడం తప్పు ఎలా అవుతుందని వ్యాఖ్యానించింది. మసీదు లోపల జై శ్రీరాం అన్న నినాదాలు చేశారంటూ ఇద్దరు వ్యక్తులపై కర్ణాటకలో కేసు నమోదయింది. ఆ కేసును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ పిటిషనర్‌ హైదర్‌ ఆలీ సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీలుపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ‘‘జై శ్రీరాం అన్న నినాదం చేయడం నేరమవుతుందా? ఆ ఇద్దరు వ్యక్తులే ఈ నినాదం చేసినట్టు ఎలా గుర్తించారు? సీసీటీవీ కెమేరాలు ఉన్నాయని చెబుతున్నా వారిని గుర్తించింది ఎవరు?’’ అని అడిగింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. 2023 సెప్టెంబరు 24న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మసీదులో చొరబడి జైశ్రీరాం నినాదాలు చేయడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదైంది. అయితే, ఆ నినాదం చేయడం వల్ల ఎలాంటి ఘర్షణలు జరగలేదని, నినాదాలు ఎవరు చేశారో తాను స్వయంగా చూడలేదని పిటిషనరే పేర్కొన్నందున కేసు కొట్టివేస్తున్నట్టు కర్ణాటక హైకోర్టు తెలిపింది.