
394views
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలోని ఒకటో వార్డు పరిధిలోని పార్వతీశంపేట వద్ద అక్రమంగా కబేళాకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నట్టు ఎస్‌ఐ కె.వెంకటేష్ తెలిపారు. శుక్రవారం కొత్తూరు మండలం బలద సంత నుంచి 34 ఆవులను అదే మండలానికి చెందిన నిచ్చెర్ల మల్లేష్, కుప్ప త్రినాథ్, షణ్ముఖరావు, కడుం గ్రామానికి చెందిన శంకర్ తోలుకొని వస్తుండగా పార్వతీశంపేట వద్ద పట్టు కున్నట్టు తెలిపారు. ఈ తరలింపులో సూత్రధారి, పాత్రధారి పట్టణంలోని ఏడో వార్డు చింతాడకు చెందిన గొంటి శేఖర్ ఉన్నట్టు తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న 34 ఆవులను విజయనగరం జిల్లా గుర్లలోని గోశాలకు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పశు సంవర్థకశాఖ ఏడీ రోణంకి ఆనందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




