News

అనకాపల్లిలో 65వ కిసాన్ మేళా

232views

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనకాపల్లిలో 65వ కిసాన్ మేళా కార్యక్రమాన్నిస్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాభసాటి వ్యవసాయం చేసేందుకు అందరూ కృషి చేయాలని, ప్రకృతిని అనుసరించి ముందుకు వెళ్లాలని అలా వెళ్ళినట్లయితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని అన్నారు.ఏమైనా కాలక్రమైనా మార్పులు వస్తున్నాయని రైతులు వాటిని గమనించి అనుకూల వాతావరణ ఉన్న పంటలు పండించేందుకు కృషి చేయాలని శాస్త్రవేత్తలు రైతులను సూచించారు.

ఈ కిసాన్ మేళాలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు మరియు పనిముట్లుస్టాల్స్ని ఏర్పాటుచేసి రైతులు వాటిని ఉపయోగించుకుని,వ్యవసాయ ఉత్పత్తిని పెంచే విధానం గురించి వాటిని వినియోగించే పద్ధతులను రైతులకు తెలియజేశారు.వీటితోపాటు చిరుధాన్యాలతో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారం ఆహారానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రంలో తయారుచేసిన మరియు మిల్లెట్స్ తో తయారు చేసిన అనేక స్టాల్స్ ను ఏర్పాటు చేసి కిసాన్ మేళాకు విచ్చేసిన రైతులకు పిల్లలకు అవి పండించడం అవి తింటే కలిగే ఉపయోగాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయంపై ఆసక్తిని పెంచేందుకు విద్యార్థినీ విద్యార్థులు మరియు అధిక సంఖ్యలో రైతులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.