News

మసీదు కమిటీ పిటిషన్ కు విచారణార్హత లేదు

268views

మథురలోని కృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా వివాదానికి సంబంధించి ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చని హిందూ కక్షిదారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం న్యాయవాది బరుణ్ సిన్హా వాదనలపై విచారణ నిర్వహించింది. ప్రస్తుత తరుణంలో ముస్లింల తరఫు పిటిషన్ కు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణార్హత లేదని సిన్హా పేర్కొన్నారు.