
301views
కేరళలోని పథనంథిట్ట, ఇడుక్కి
జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. నదిలోకి, స్నానపు ఘాట్లోకి ప్రవేశాలను, అటవీ మార్గంలో భక్తుల రాకపోకలను నిషేధించారు. సాథ్రం నుంచి శబరిమల ఆలయానికి వెళ్లే అటవీ మార్గాన్నీ మూసివేసినట్లు సోమవారం పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఇరు జిల్లాల కలెక్టర్లు స్పష్టం చేశారు. మరోవైపు, ఫెయిం జల్ తుపాను కారణంగా కేరళలో మంగళవారం భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు భారత వాతా వరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.





