
భారతీయ యువకుడికి బంగ్లాదేశ్ లో భయంకరమైన అనుభవం ఎదురైంది. తన స్నేహితుడ్ని కలవడానికి బంగ్లాదేశ్ కి వెళ్లిన సయన్ ఘోష్ పై ఛాందసులు దాడి చేశారు. సయన్ ఘోష్ స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని బెల్ఘరియా ప్రాంతం. తన స్నేహితుడ్ని కలిసి, భారత్ కి తిరుగుపయనం అవుతున్న సందర్భంలో ఛాందసులు దాడి చేశారు. ఢాకాలోని బగన్ బరీ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి సయన్ ఘోష్ ఐస్ క్రీమ్ తింటుండగా… అక్కడికి చేరుకున్న ఛాందస గుంపు సయన్ ని నీ దేశమేమి? నీ మతమేమి? నీ పేరేమి? అంటూ బెదిరించారు.
ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. తాను హిందువునని, తన దేశం భారత్ అని చెప్పడంతో దాడి ప్రారంభమైంది. ఛాందస మూకలు తన పర్సు, డబ్బు, మొబైల్ లాక్కెళ్లారని, కత్తితో దాడి చేశారని ప్రకటించారు. తన స్నేహితుడు దాడిని ఆపడానికి ప్రయత్నిస్తే… తనపై కూడా దాడి చేశారని, చుట్టుపక్కల వారు కనీసం ఆపలేదన్నారు. బంగ్లాదేశ్ లో తాను ఎమర్జెన్సీకి ఫోన్ చేశానని, స్పందన లేదన్నారు. భారతీయులు ఎవ్వరూ బంగ్లాదేశ్ కి వెళ్లొ్దని, అంత సురక్షితం కాదని సయన్ ఘోష్ అన్నాడు.





