ArticlesNews

అజ్మీర్‌ దర్గా స్థలంలో గతంలో శివాలయం

375views

రాజస్తాన్‌లోని అజ్మీర్‌ దర్గా ప్రస్తుతం స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది.

పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్‌ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్‌ఐ)కి నోటీసులు జారీ చేసింది.

ఏమిటీ వివాదం?: అజ్మీర్‌ దర్గాను సంకట్‌ మోచన్‌ మహాదేవ్‌ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్‌ నెలలో అజ్మీర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్‌ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్‌ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్‌ చేశారు. ఏఎస్‌ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్‌ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు.

సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్‌ సింగ్‌
అజ్మీర్‌ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రశ్నించారు. మొఘల్‌ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.