ArticlesNews

మహా కుంభమేళా ప్రతి 12 ఏళ్లకి ఎందుకు వస్తుంది? మతపరమైన ప్రాముఖ్యత ఏమిటంటే

307views

కుంభమేళా అనేది భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక ప్రధాన మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్వహించబడుతుంది. ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలలో ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో నిర్వహించబడుతుంది. ఈ కుంభ మేళా సమయంలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. హిందూ మత పరమైన దృక్కోణంలో కుంభమేళా చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఎందుకు వస్తుంది అనే దానితో ముడిపడి ఉన్న లోతైన నమ్మకాలు, పురాణాలు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

12 ఏళ్ల వ్యవధి మాత్రమే ఎందుకు?
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా ఎందుకు నిర్వహించబడుతుందనే దాని వెనుక అనేక మత విశ్వాసాలు ఉన్నాయి. కుంభమేళా మూలం సముద్ర మథనానికి సంబంధించిన పౌరాణిక కథతో ముడిపడి ఉందని నమ్మకం. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఈ అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసుల మధ్య 12 దివ్య రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ 12 దివ్య రోజులు భూమిపై 12 సంవత్సరాలకు సమానమని నమ్మకం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయని.. ఆ అమృత బిందువులు నాలుగు భూమిపై పడ్డాయని కూడా నమ్ముతారు. కనుక ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుంది. గురు గ్రహం ఒక నిర్దిష్ట రాశిలో ఉన్నప్పుడు అదే సమయంలో కుంభమేళా నిర్వహించబడుతుంది.
మహా కుంభమేళా 2025 స్నానం చేసేందుకు ముఖ్యమైన తేదీలు

మొదటి రాజ స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.