
227views
దేవాలయాలను పరిరక్షించుకుందామని విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు యత్తపు గురివిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ పేర్కొన్నారు.వైయస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ సమావేశంలో వారు మాట్లాడారు. హిందూ దేవాలయాల పైనే ప్రభుత్వాలు పెత్తనం చెలాయిస్తున్నాయని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణను స్వయం ప్రతిపత్తి కల్గిన ధార్మిక పరిషత్ కు అప్పచెప్పాలన్నారు. ఇందుకోసం 2025 జనవరి 5న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావానికి తరలి రావాలన్నారు. పూర్తి సమాచారం కోసం ఫోన్ నంబర్: 9240015333ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.నారాయణస్వామి, బాలగురవయ్య, వై శ్రీనివాసులు, భజన రమణయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.





