News

ఆలయాల్లో వరుస చోరీలు

256views

అమ్మవారి ఆలయాలే లక్ష్యంగా దొంగలు పేట్రేగిపోతున్నారు. అమ్మవారి విగ్రహాలకు ఉన్న బంగారు ఆభరణాలు కాజేస్తున్నారు. హుండీల్లోని నగదు దొంగిలిస్తున్నారు.చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారి సమీప మోర్దానపల్లి గంగమ్మ ఆలయంలో హుండీని దొంగలు అపహరించారు. గుర్తించిన స్థానికులు గ్రామ సమీపంలోని చెరువు కట్టపై చిల్లర నాణేలు ఉండటాన్ని గమనించి పరిసరాల్లో వెతకగా సమీప చెరువులో హుండీని పగుల గొట్టి పడేయడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గతేడాది నుంచి భూమిరెడ్డిపల్లిలోని విరూపాక్షమ్మ ఆలయం, కాశిరాళ్ల గంగమ్మ ఆలయం, పెరుమాళ్లపల్లి, పాచిగుంట అమ్మవారి ఆలయాల్లో వరుస చోరీలు జరిగాయి. ఈ దోపిడీలన్నీ ఒకే తర హాలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయినా దొంగలను పట్టుకోవడంలో, నిఘా ఉంచి వారిని గుర్తించడంలో విఫలమయ్యారు. దొంగల ముఠా నిత్యం ఏదో ఒక మండలంలో దొంగతనానికి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతోంది. అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలున్నా మాస్కులు ధరించి పోలీసులకు సవాలుగా మారింది. ఇటీవల జిల్లాలోని యాదమరి, బంగారుపాళ్యం, గుడిపాల, ఐరాల, తవణంపల్లి, జీడీనెల్లూరు, ఎస్.ఆర్.పురం మండలాల్లో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు