
209views
సనాతన ధర్మం గొప్పదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో ఉపనిషన్మందిరం, సుమిత్రా కళా సమితి ఆధ్వర్యంలో ఆయన ‘సూర్యదర్శనం’ ప్రవచన యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురాణాల్లో ఉన్న నైతిక విలువలు కలిగిన అంశాలను పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీర్ధయాత్ర క్షేత్రాల సందర్శన, గోమాత పూజలు, దేవతా వృక్షాలను పూజించడం వల్ల హిందుత్వం అనిపించుకుంటుందన్నారు. నిర్వాహకులు ఇప్పిలి శంకర్ శర్మ, గుమ్మా నగేష్, పి.జగన్మోహన్‌రావు, నిక్కు అప్పన్న, గుత్తు చిన్నారావు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.





