News

వెయ్యేళ్ల నాటి నంది విగ్రహం లభ్యం

370views

తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం ఆదికుంబేశ్వర్‌ ఆలయంలో వర్షం నీరు నిలిచి పోకుండా కాలువ తవ్వకాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాలువ మూడడుగల లోతున తవ్విన సమయంలో, రెండున్నర అడుగుల ఎత్తు, పొడవుతో అద్బుత శిల్పకళ నైపుణ్యంతో కూడిన నంది విగ్రహం బయల్పడింది. ఈ విషయమై ఆలయ నిర్వహణాధికారి కృష్ణన్‌కుమార్‌ మాట్లాడుతూ… చోళుల కాలం నాటి శిల్పాలతో ముదురు రంగు నల్లరాతితో నంది విగ్రహం ఉందన్నారు. ఈ విగ్రహం సుమారు వెయ్యేళ్ల ప్రాచీనమైనది కావచ్చని, ఈ విషయమై రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని, ఆ తర్వాత పూర్తి సమాచారం అందుతుందని ఆయన తెలిపారు.