
శబరిమలకు వెళ్లేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్‌లు హనుమంతు అమరసింహుడు, కెఆర్‌ఎస్ శర్మలు తెలిపారు. శబరిమలకు వెళ్లే ఆర్టీసీ ప్రత్యేక బస్సును శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ శ్రీకాకుళం 1, 2 డిపోల మేనేజర్లు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ శబరిమలకు వెళ్లేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చిందన్నారు. భక్తులు బస్సు మొ త్తం లేదా విడివిడిగా టికెట్‌లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బస్సు మొత్తం బుక్ చేసుకుంటే ఏడుగురు స్వాములకు ఉచిత ప్రయా ణం కల్పిస్తామన్నారు. అలాగే 5రోజుల టూర్, 6రోజుల టూర్, 7రోజుల టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. శబరి మలకు వెళ్లే భక్తులు ఈ కింది నంబర్లను సంప్రదిస్తే ‘ఒక్క ఫోన్ కాల్ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు వి.రమేష్, ఎ.గంగరాజు, ప్రసాద్, ఎం.పీ.రావు, రాజు, సెక్యూరిటీ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.





