News

‘‘ది సబర్మతీ రిపోర్టు’’ కి పన్ను మినహాయింపు : రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటన

151views

‘‘ది సబర్మతీ రిపోర్టు’ సినిమా విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు పన్ను మినహాయింపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా ఆ భయంకర రోజుల్లో జరిగిన వాస్తవ సన్నివేశాలను వర్ణించిందన్నారు. కానీ.. కొందరు ఆ సన్నివేశాలకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ఆపాదించారన్నారు. కానీ ఈ సినిమా వాస్తవికతను ప్రజల ముందు వుంచిందన్నారు. ఈ సినిమాకి పన్ను మినహాయింపు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

మరోవైపు తప్పుడు కథనాలను ఈ చిత్రం సమర్థవంతంగా తిప్పికొట్టిందని, అలాగే వాస్తవిక పరిస్థితులను అత్యంత ధైర్యంగా ప్రజల ముందు వుంచిదన్నారు. హృదయవిదారక సంఘటనలను అత్యంత సున్నితంగా సినిమాల చూపించారని సీఎం పేర్కొన్నారు. ఈ సినిమాను ప్రజలందరూ తప్పకుండా వీక్షించాలని సీఎం పిలుపునిచ్చారు. అప్పుడు జరిగిన విషయాలు, భవిష్యత్తుకు మార్గదర్శనం చేయడంలో ఈ సినిమా సహాయపడుతుందని సీఎం భజన్ లాల్ శర్మ పేర్కొన్నారు.