News

తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి

414views

తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి చేస్తామన్నారు టిటిడి ఇఓ జె.శ్యామలారావు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో పాత్రికేయులతో టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామన్నారు.తిరుమలలో భక్తులు నడిచే వెళ్ళే విధంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తామని.. మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మిస్తామన్నారు. గతంలో తిరుమల అభివృద్ధి ప్లాన్ ప్రకారం జరగడం లేదని.. తిరుమలలో డోనర్లు కట్టిన వసతి గృహాల పేర్లు తొలగిస్తామని.. దేవుడి పేర్లు పెట్టాలని డోనర్లకు సూచిస్తున్నామన్నారు. తిరుమలలో కడుతున్న బిల్డింగ్స్ టౌన్ ప్లానింగ్ నిబంధనల ప్రకారం కట్టాలని.. అర్బన్ డెవలప్ మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో నిర్మితమవుతున్న భవనాలను టౌన్ ప్లాన్ విభాగం పరిశీలిస్తుందని.. గతంలో శారదాపీఠం ఇష్టానుసారం తిరుమలలో భవనాన్ని నిర్మించారు..ఆ భవనాన్ని టిటిడి స్వాధీనం చేసుకుందన్నారు. ఇష్టానుసారం నిర్మాణాలు జరిగితే తిరుమలను ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడం కష్టమవుతుందని.. విజన్ డాక్యుమెంట్ సిద్థం చేసి తిరుమలను అభివృద్ధి చేస్తామన్నారు.పాలకమండలిలో తీర్మానం తరువాత తిరుమలను అభివృద్ధి చేయడం మొదలుపెడతామన్నారు.