News

మహాప్రాకారం, గాలిగోపుర నిర్మాణాలకు భూమి పూజ

396views

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో రూ.2.6 కోట్లతో ఆలయ గాలిగోపురం, రూ.1.65 కోట్లతో మహాప్రాకారం, రూ.23 లక్షలతో రథశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శృంగేరి శారదా ఉత్తర పీఠాధిపతి విధుశేఖర భారతి శాస్త్రోక్తంగా నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తొలుత పీఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. క్షేత్రవాసి ప్రసన్న వేంకటేశ్వరస్వామికి, ఉభయదేవేరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. సృష్టిలోని సకల ప్రాణికోటికి భగవంతుడే ఆధారమన్నారు. మంత్రి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.