
360views
శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.కర్నూలు జిల్లా మద్దికెరలోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయ ఎదుట, స్థానిక పశువైద్యశాల వెనుక వైపు 550 ఏళ్ల కిందట నిర్మించిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరుతున్నా పట్టించుకోవడం లేదు. వాటికి మరమ్మతులు చేసి, చరిత్రను తెలిపే శిల్ప సంపదను భావి తరాలకు అందించాల్సి ఉంది. వీటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతోంది. వీటి చుట్టూ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి నిరాదరణకు గురవుతున్నాయి.





