
316views
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలకేంద్రంలో స్థానిక వాల్మీకుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు జ్యోతులను మోసుకుని ఊరేగింపుగా వెళ్లి వాల్మీకి మహర్షికి సమర్పించారు. ఈ మహోత్సవానికి వివిధ గ్రామాల నుంచి వాల్మీకులు పెద్దఎత్తున తరలి వచ్చారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. సాయంత్రం గ్రామంలో వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని ఊరేగించారు.





