
సమాజం మొత్తం కూడా ముస్లిం సమాజానికి రుణపడి వుండాలట. ఈ మాట చెప్పింది రాజ్యసభ మాజీ ఎంపీ మహ్మద్ అదీబ్. ఎందుకో తెలుసా… ముస్లింల వల్లే పాక్ సరిహద్దు లాహోర్ దగ్గరే ఆగిందట. లేదంటే లక్నో వరకూ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయేదట. అప్పట్లో అలా జరగకుండా ఒకరిద్దరు ముస్లిములే ఆపారట. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ ముస్లిం సదస్సు జరిగింది. ఇందులో మహ్మద్ అదీబ్ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దీంతో జాతీయవాదులు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక… వక్ఫ్ సవరణ బిల్లు తేవడం అంటే వక్ఫ్ బోర్డుపై దాడికి దిగడమేనని అభివర్ణించారు.
మన ప్రాంతంలోనే మనం నేరస్థులుగా జీవిస్తున్నామంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మనం దేశద్రోహులుగా మారిపోయామన్నారు. మనతో పాటు వుంటూనే, మనతోనే వారి జీవితాలను ముడివేసుకున్న వారు ఇప్పుడు పాకిస్తాన్ కి వెళ్లి మనల్నే విమర్శిస్తున్నారని తెలిపారు. తాము జిన్నాను తిరస్కరించామని, లియాఖత్ అలీఖాన్ ను కూడా నమ్మలేదన్నారు. నెహ్రూ, గాంధీ, మౌలానా ఆజాద్ ను నమ్మామని, ముస్లింలమైనా జిన్నాతో కలిసి వెళ్లలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ చిన్న దేశంగా వుండడానికి ముస్లింలే కారణమన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అక్కడ వారిని అణచివేస్తోందని ఆరోపించారు.





