News

హోమగుండంలోకి రశీదు పుస్తకాలు… అపచారం చేసిన అధికారులు

399views

పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అనుమానాలు రేపుతోంది. ఓ వైపు హోమం జరుగుతుండగా… ద్రవ్యాలతో పాటు రశీదు పుస్తకాలను కూడా అధికారులు హోమగుండంలో వేసేశారు. హోమ గుండాన్ని సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి హోమగుండంలోకి రసీదు పుస్తకాలను వేసేశారు. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.

అయితే… రశీదు పుస్తకాలను దహనం చేయడం వెనుక కుట్ర దాగి వుందన్న అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ద్రవ్యాలకు బదులుగా రసీదు పుస్తకాలు వేయడం తీవ్ర అపచారం కూడా.ఆలయ ప్రతిష్టతను అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఆలయ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం శోచనీయమని వాపోతున్నారు.