News

హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిదీ

262views

హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సొంపేట మండలం అనంతపురం గ్రామంలో శ్రీ వేద గాయత్రి మహాదేవ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం వల్ల లోకం సుభిక్షంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆలయాల ప్రాముఖ్యత ప్రస్తుత తరానికి తెలియజేయవలసిన బాధ్యత అందరిపై ఉందని కేంద్రమంత్రి అన్నారు.