News

దేశవారసత్వాన్ని పరిరక్షించాలి

265views

భారతీయ యువత సామర్థ్యానికి యావత్ ప్రపంచం ఆకర్షితమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని వడ్తాల్లోని శ్రీ స్వామినారాయణ్ మందిర్ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా దృశ్యమాధ్యమం ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ… 200 సంవత్సరాల క్రితం స్వామినారాయణ స్థాపించిన వడ్తాల్ ధామ్ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజలు సజీవంగా నిలిపారన్నారు. “వికాస్ భీ విరాసత్ భీ” అనే ప్రభుత్వ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ.. ఏ దేశమైనా తన వారసత్వాన్ని పరిరక్షించకుండా పురోగమించదని అన్నారు. భారతదేశం గొప్ప వారసత్వం గురించి గర్వపడాలని, దానిని భావి తరాలకు అందించాలని దేశ ప్రజలకు, ఆధ్యాత్మిక నాయకులకు నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.