
319views
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నివేదిక అందజేస్తామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన మొదటి స్టడీ టూర్‌లో పలు సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో స్టడీ టూర్లలో పరిశీలించిన అంశాల ఆధారంగా జేపీసీ నివేదిక ఉంటుందని స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోందన్నారు.
ఇదిలా ఉంటే, వక్ఫ్ సవరణ బిల్లు-2024, ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ ప్రతిపాదన నేపథ్యంలో డిసెంబర్ 20, 2024 వరకు జరిగే ఈ శీతాకాల సమావేశాలు అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.





