News

18న తితిదే నూతన మండలి తొలి సమావేశం

256views

టీటీడీ నూతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం ఈ నెల 18న జరగనుందని సమాచారం. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు అన్నమయ్య భవనంలో సమావేశమై పలు అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎజెండా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలిసారి జరగనున్న కొత్త బోర్డు సమావేశంలో ప్రధానంగా కొనుగోళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి తీర్మానాలు వెల్లడించనున్నారు. గత బోర్డు నిర్ణయాలపైనా చర్చించే అవకాశం ఉంది. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై దృష్టిసారించనున్నారు.