News

భీమవరంలో ఆర్ఎస్ఎస్ సభా మందిర ప్రారంభోత్సవం

295views

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రెండో అంతస్తులో నిర్మించిన సభా మందిర ప్రారంభోత్సవంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)లు పాల్గొన్నారు.

ఆర్ ఎస్ ఎస్ కార్యక్రమాలను విస్తృత పరిచేందుకు, సంఘ్ సమావేశాలకు వసతి సమకూరిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. దేశ హితం కోసం వ్యక్తినిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని, అందులో ఒక స్వయంసేవక్ గర్వపడుతున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శృంగవృక్షం శ్రీదత్త పీఠం పీఠాధిపతులు శ్రీసాయి దత్త నాగనంద సరస్వతీ స్వామీజీ, టీడీపి రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వర్రావు, పొత్తూరి బాపిరాజు, యిర్రింకి సూర్యారావు, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.