News

పార్వేటకు యునెస్కో గుర్తింపునకు ప్రతిపాదనలు

328views

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలకు ప్రపంచ వారసత్వ హోదా వచ్చే అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన మంత్రిత్వక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ అహోబిలం పార్వేట మహోత్సవాల ప్రాధాన్యతను వివరిస్తూ లేఖ రాశారని అహోబిలం దేవస్థాన నిర్వాహకులు బుధవారం తెలిపారు.