News

ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస పూజలు

261views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న‌ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం సందర్భంగా నెలరోజుల పాటు నిర్వహించే పూజల్లో భాగంగా శనివారం దేవస్థానంలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం సహస్ర లింగార్చన సేవ, సాయంత్రం ఊంజెల్ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ కార్తీక మాసం లో ప్రతి రోజు సహస్ర లింగార్చన సేవ, ఊంజల్ సేవ ఆర్జిత సేవ గా జరుగుతాయన్నారు.ఈ రోజు ఆదివారం నాడు కనక దుర్గ అమ్మవారు గాజుల అలంకరణలో దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు