News

2 నుంచి హనుమద్‌ దీక్షలు

230views

రేపటి నుంచి (నవంబర్ 2 )నుంచి హనుమద్‌ మండల దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీక్షకు సంబంధించిన పోస్టర్లను ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆలయ ఈఓ కె.వాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆంజనేయస్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే మండల దీక్షలు నవంబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. నవంబర్‌ 22వ తేదీన అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. మండల, అర్ధమండల దీక్షలు చేపట్టే భక్తులు ఆయా తేదీల్లో ఆలయంలో మాలను ధరించవచ్చునని పేర్కొన్నారు. మండల దీక్షలు ముగిసిన అనంతరం డిసెంబర్‌ 12న ఇరుముడి సమర్పణలో భాగంగా తిరు ఉత్సవం కార్యక్రమం ఉంటుందన్నారు. డిసెంబర్‌ 13న హనుమద్‌ వ్రతంతో మండల దీక్షలు ముగుస్తాయన్నారు.