
245views
టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్ సహా యూరప్ ని 8 దేశాల్లోని మొత్తం 13 నగరాల్లో తిరుమల వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. వచ్చే నెల 9 నుంచి డిసెంబర్ వరకు ఆయా నగరాల్లో కల్యాణోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో శ్రీబాలాజీ వేదిక్ సెంటర్(జర్మనీ)కు చెందిన కార్యక్రమ సమన్వయకర్తలు వెలగా సూర్యప్రకాశ్, జవాజీ వెంకటకృష్ణ, సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఏపీఎస్ఆర్ఎస్ సీఈవో పి. హేమలతారాణి పాల్గొన్నారు.





