
ముస్లింలు మళ్లీ సర్ తాన్ సే జుడా’’ (తల నుంచి మొండెం వేరుచేయడం) అన్న నినాదాల్ని బహిరంగంగా అందుకున్నారు. యూపీలోని ముజఫర్ నగర్ లో రోడ్లపైనే ముస్లిం గుంపు ఈ నినాదాలిచ్చింది. ఓ హిందువు దైవ దూషణ చేశాడంటూ ముస్లిం ఛాందసులు ఆరోపించారు. దీంతో రెండు రోజుల క్రితం ముస్లిం ఛాందసులు రోడ్లపైకి వచ్చి నినాదాలిచ్చారు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర పోస్ట్ చేశాడంటూ, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ ను కూడా ముట్టడించారు. ముస్లింల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. ఈ అరెస్ట్ ను అధికారికంగా ప్రకటించారు కూడా. అయినా ఆందోళనకారులు నిరసనను కొనసాగించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేశాడని, అతడ్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ప్రకటించారు. ఫిర్యాదు అందిన కాసేపటికే తాము అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడ్ని తిరిగి వదిలేసినట్లు పుకార్లు రేగాయని, అందుకే ఆందోళన పెరిగిందని తెలిపారు. వున్న పరిస్థితిని వెల్లడించడంతో పరిస్థితి అదుపులో వుందన్నారు.అయితే ముస్లింలు ఇలా సర్ తాన్ సే జుడా అని బహిరంగంగా నినాదాలివ్వడం, ఇతరుల్ని బెదిరించడం ఇదేమీ కొత్త కాదు. అక్కడక్కడా ప్రతి రోజూ ఏదో ఓ ప్రాంతంలో ఈ నినాదాలు ఇస్తూనే వున్నారు.ముఖ్యంగా ఈ రెండు నెలల కాలంలోనే ఇలాంటి ఘటనలు మూడు వెలుగలోకి వచ్చాయి. అంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తరుచూ ఈ నినాదాలే వస్తున్నాయి.
తాజాగా గత నెల 16 న యూపీలోని సిద్ధార్థనగర్ లో బరావాఫత్ ఊరేగింపు సందర్భంగా హిందూ దేవాలయం భరత్ భరి దగ్గర ముస్లింలు సర్ తాన్ సే జుడా నినాదాలు చేశారు. ఇది వెలుగులోకి రావడంతో పోలీసులు తక్షణమే విచారణ ప్రారంభించారు. అలాగే మిలాద్ ఉన్ నబీ రోజున కూడా ముస్లిం ఛాందసుల గుంపు అదే సిద్ధార్థనగర్ లోని శివాలయం దగ్గర కూడా సర్ తాన్ సే జుడా నినాదాలిచ్చింది.
ఇక… గత నెల 29 న లోహియా నగర్ లోని హిందీ భవన్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాస్నా దేవాలయాధిపతి యతి నరసింహానంద సరస్వతీ చేసిన వ్యాఖ్యలపై కూడా ముస్లిం గుంపు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అప్పుడు కూడా ఈ నినాదాలే చేశారు.
ఇవే గాక.. ఈ మాసంలో యూపీలోని బహ్రైచ్ లో మరో కేసు బయటపడింది. బురఖా ధరించిన మహిళలు దేవాలయాల్లోకి ప్రవేశించడంపై హిందూ బాలుడికి, ముస్లిం బాలుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా పెద్దగా మారింది. ఈ సమయంలో ముస్లిం బాలుడు సల్మాన్ అజారీ హిందూ దేవతలను అవమానపరుస్తూ మాట్లాడాడు. ప్రతిగా హిందూ బాలుడు కూడా స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.దీంతో ఆ బాలుడు దైవ దూషణ చేశాడంటూ ముస్లిం వర్గం ఆరోపణలకు దిగింది. చివరికి హిందూ బాలుడు క్షమాపణలు చెప్పాడు కానీ… అర్ధరాత్రి హిందూ బాలుడి ఇంటి ముందుకి ముస్లిం వర్గీయులు వచ్చారు. సర్ తాన్ సే జుడా అంటూ నినాదాలు చేశారు.
చిన్న విషయాలకు, పెద్ద విషయాలకు… వారి తప్పులే వున్నా… హిందువులను భయపెడుతూ ముస్లిం గుంపు స్వైరవిహారం చేస్తోంది. తరుచూ సర్ తాన్ సే జుడా అంటూ నినాదాలిస్తూ భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దీనికోసం ఓ బలమైన చట్టం రావాలని హిందూ పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నాయి. ఇలాంటి తప్పుడు నినాదాలతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని నిరోధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.





